త్వరలో నియోజకవర్గాల సమన్వయకర్తల నాలుగో జాబితా విడుదల చేస్తామని వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రీజనల్ కోర్దినేటర్ విజయసాయిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి ఎలాంటి సమస్య లేదని.. పార్టీలో ఆయన అత్యంత విలువైన నాయకుడని అన్నారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యం తగ్గదని, బాలినేని స్థానం ఆయనకు ఉంటుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.