కర్ణాటక నుంచి అక్రమంగా ఆంధ్రకు తరలిస్తునన మద్యాన్ని సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ రామకృష్ణ శుక్రవారం కంబదూరు సెబ్ పోలీస్స్టేషనలో వివరాలు వెల్లడించారు. కుందుర్పి మండలం మీదుగా ఆంధ్రకు కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో దాడులు నిర్వహించామన్నా రు. ఈ దాడుల్లో రూ. 3 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనంతో పాటు, 72 బాక్సుల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నా మన్నారు. డ్రైవర్లోను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు.