లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నాలుగోసారీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆయనను ఆదేశించింది.
గతంలో కూడా 3 సార్లు ఆయనకు నోటీసులు పంపినా ఈడీ ముందు కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈడీ ఉద్దేశపూర్వకంగా తనకు సమన్లను జారీ చేస్తోందని గతంలో ఆయన ఆరోపించారు. మరోవైపు ఆయన విచారణకు హాజరైతే ఈడీ కచ్చితంగా అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa