సంక్రాతి పండుగ సందర్భంగా బత్తలపల్లి పరిసర ప్రాంతాల వ్యాప్తంగా ఎవరైనా కోడిపందేలు, పేకాట, తదితర ఆసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని బత్తలపల్లి ఎస్ఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా సాంప్రదాయ క్రీడలను ఆడుతూపాడుతూ జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.