ఉరవకొండ మండలంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారంకు 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉరవకొండ పట్టణ సమీపంలోని లత్తవరం రోడ్డు వద్ద ఉన్న హంద్రీనీవా కాలువలో ఎస్మా జిఓ కాపీలను వేసి నిరసన వ్యక్తం చేశారు. నెల రోజులకు పైగా తాము సమ్మె చేస్తేన్న కూడా ప్రభుత్వానికి కనపడలేద అని అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న తమపై కన్నెత్తి కూడా చూడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.