రామమందిరంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని ఆర్.ఎస్.ఎస్.నేత రామ్ మాధవ్ అన్నారు. శనివారం నాడు అంబేద్కర్ కోనసీమజిల్లా అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా రామ్‌మాధవ్ మాట్లాడుతూ... అయోధ్య రామ మందిరం మహోత్సవ కార్యక్రమంపై కాంగ్రెస్ వాళ్లే రాజకీయం చేస్తున్నారని.. ఇది రాజకీయం కాకూడదనే అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, సామాన్యులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారని తెలిపారు. రాజకీయం చేయాలనుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను ఎందుకు పిలుస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోనే కొంతమంది స్వాగతిస్తుంటే కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్న తీరును వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలని రామ్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్‌కు 10 లక్షలు చెక్కును ప్రముఖ పారిశ్రామికవేత్త మెట్రోకెమె అధినేత నందెపు బాలాజీ విరాళంగా అందించారు.