విమాన సిబ్బంది ముఖ్యంగా పైలట్లు అలసిపోకుండా ఉండేందుకు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డీజీసీఏ కొన్ని చర్యలు చేపట్టింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) నిబంధనలను సవరించింది.
ఇందులో భాగంగా వారానికి 48 గంటల విశ్రాంతి, రాత్రి వేళల పొడిగింపు, నైట్ ల్యాండింగ్ తగ్గింపు వంటి సవరణలు చేసింది. పైలట్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంస్కరణలు వచ్చాయని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ప్రకటించారు.