విశాఖలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఆగనంపూడి టోల్‌ప్లాజా దగ్గర అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని 20 బస్సులపై జరిమానా విధించారు.
కాగా బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ లేకుండా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కాయి. రూల్స్ పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.