అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ‘కాంగ్రెస్ పార్టీతో 55 ఏళ్ల అనుబంధానికి తెరపడింది.. ఇన్నాళ్లూ మద్దతుగా నిలిచిన కార్యకర్తలు, సహచరులు, పార్టీ నేతలకు ధన్యవాదాలు.. అభివృద్ధి బాటలో పయనిస్తున్నాను అని’ ఆయన ట్వీట్ చేశారు. సీనియర్ నేత మురళి దేవరా కుమారుడైన మిలింద్ దేవరా.. 2004, 2009 ఎన్నికల్లో ముంబయి సౌత్ లోక్ సభ నుంచి పోటీచేసి గెలుపొందారు.
అయితే, వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన నేత (ఉద్ధవ్ వర్గం) అర్వింద్ సావంత్ చేతిలో ఓడిపోయారు. కాగా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో దేవరా చేరతారని ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ. కీలక నేతలు రాజీనామాలు చేయడం కాంగ్రెస్‌ను కలవరపెడుతుంది. మిలింద్ ఒక్కరే కాదు.. ఐదేళ్లలో మరో 10 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పార్టీని వీడారు.
ముంబయి సౌత్ సీటును ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించడంపై ఆయన ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆదివారం ఓ వీడియోను విడుదల చేసిన దేవరా.. కూటమి భాగస్వామి అటువంటి ప్రకటనలు ఆపకపోతే, తమ పార్టీ కూడా పలుస్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుందని విమర్శించారు. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరాకు అన్ని రాజకీయ పార్టీలలో స్నేహితులు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు అండగా నిలిచారు. మురళీ దేవరాతో సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాను. ‘ఆయనకు అన్ని రాజకీయ పార్టీలలో సన్నిహిత మిత్రులు ఉన్నారు.. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలిచే దృఢమైన కాంగ్రెస్‌వాది’ అని ట్విట్టర్‌లో వెల్లడించారు.