కందుకూరు మండలంలోని మహదేవపురం గ్రామానికి చెందిన తెలుగు యువత ఆధ్వర్యంలో ఆదివారం మీట్ విత్ ద లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే డాక్టరు దివి శివరాం, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..... గ్రామాల నుంచి బయటకు వెళ్లి వారంతా తమ గ్రామాల అభివృద్ధి, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. మహదేవపురం గ్రామం మొదటి నుంచి టీడీపీకి కంచుకోట అని, రాబోయే ఎన్నికల్లో యువత నడుంబిగించి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని కోరారు.