సంక్రాంతి సంబరాలు ఆదివారం అట్టహసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకున్నారు. రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయం ఎదుట ఏపీ సీఎం విడుదల చేసి ప్రజా వ్యతిరేక చట్టాల ప్రతులను టీడీపీ నాయకులు కొమ్మా శివ, నార్జాల హేమరాజ్, గడికోట సుబ్బరాయుడు, రాజ, తేనేపల్లి చిన్నా, మహిళా నాయకురాలు బాలు ఇందిరమ్మ తదితరులు కాల్చివేశారు. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ నాగవరంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ముక్కా రూపానందరెడ్డి ముక్కావారిపల్లెలో తన కుటుంబ సభ్యులతో కలసి వైసీపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు టీడీపీ ఇనఛార్జ్ కస్తూరి విశ్వనాథనాయుడు తిరుపతిలోని తన నివాసంలో వైసీపీ పాలన అంతం కావాలని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.