తనకల్లు మండలకేంద్రంలోని దళితవాడలో ఆదివారం సుమారు 70కుటుంబాల వారు టీడీపీలోకి చేరారు. నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో వారందరూ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కందికుంట కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరినవారిలో ప్రసాద్, సునీల్, మస్తాన, నగేష్, నాగేంద్ర, మహేష్, వెంకటేష్, సాయి, క్రాంతి, లక్ష్మినారాయణ, మంజు, నాగేంద్ర, నరసింహులు, రంజిని తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ ప్రతిఒక్కరూ టీడీపీ విజయానికి శాయశక్తిలా కృషి చేయలని సూచించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రెడ్డిశేఖర్రెడ్డి, తోటకిషోర్ , రమణ చంద్రప్ప, చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు.