మయన్మార్ అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. కీలక ప్రాంతాలపై ఆ దేశ సైన్యం (జుంటా) క్రమంగా పట్టు కోల్పోతోంది. తాజాగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పాలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రెబల్ గ్రూప్ అరాకన్ ఆర్మీ ప్రకటించింది.
అక్కడి సైనిక దళాలకు చెందిన చాలా పోస్టులను ఇవి స్వాధీనం చేసుకొన్నాయి. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రెబల్స్‌తో తలపడుతున్న సైన్యానికి ఇది కీలక ఓటమి.