దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తాజాగా మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ దేశ సరిహద్దుల్లో సూది మొనంత భూభాగాన్ని ఆక్రమించినా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాకుండా ఇరుదేశాల మధ్య సముద్ర సరిహద్దులు, నార్తర్న్ లిమిట్ లైన్ను తాము గుర్తించబోమని స్పష్టం చేశారని ఉత్తర కొరియా మీడియా ఏజేన్సీ తెలిపింది.