ఏపీపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజును నియమించారు.