ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా షర్మిల నియమితులయ్యారు. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగు రుద్రరాజుకు ప్రమోషన్ లభించింది.
ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అపాయింట్ అయ్యారు. దీనితో ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెలి మధ్య పోటీ నెలకొన్నట్టయింది.