బానిస బతుకులకు విముక్తి బహుజన సమాద్వాదీ పార్టీతోనే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు పేర్కొన్నాడు. మంగళవారం హిందూపురం పట్టణంలోని ఆబాద్ పేటలోని పార్టీ కార్యాలయం వద్ద బీఎస్పీ జాతీయ కార్యదర్శి బెహన్ మాయావతి 68వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాయావతి దేశానికి చేసిన సేవలు గురించి వివరించారు. బహుజనులకు రాజ్యాధికారంతో న్యాయం జరుగుతుందన్నారు.