పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు యాడికి సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. యాడికి గ్రామ శివారులో గత కొంత కాలంగా పేకాట ఆడుతున్నారని పక్కాగా వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేశారని చెప్పారు. మండల కేంద్రానికి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 6, 150 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.