లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపు పన్నుశాఖ అప్రమత్తమైంది. ఏపీ రాష్ట్రంలో నగదు బదిలీలు, వివిధ ఖాతాల నిర్వహణ తీరు తెన్నులు,
గ్రూపులవారీగా జరిపే చెల్లింపులపై దృష్టి సారించాలని ఆశాఖ రాష్ట్రంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది. బ్యాంకుల వారిగా నిబంధనలకు అనుగుణంగా జరగని లావాదేవీలపై తమకు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సూచించింది.