ఓ వ్యక్తి బతికి ఉండగానే తన మరణాంతర కార్యక్రమాలను జరిపించుకున్నాడు. పత్రికలతో అహ్వానించి మరీ చావు విందు ఏర్పాటు చేశాడు. ఈ హృదయ విదారక ఘటన యుపిలోని ఎటా జిల్లాలో జరిగింది.
కస్బా సకీట్ మండలంలోని మొహల్లా ముషినగర్లో ఉండే హకీమ్ సింగ్ (55)అనే వ్యక్తి భూమిని తన సోదరుడు లాక్కొని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో హకీమ్ సన్యాసం స్వీకరించాడు. తాను చనిపోతే మరణానంతర కర్మలను కుటుంబసభ్యులు చేయరేమోనని సంక్రాంతి రోజున ఈ కర్యక్రమం చేశారు.