బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌పై ఐసీసీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించాడనే ఆరోపణలను నాసిర్ అంగీకరించటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అబుదాబి టీ10 లీగ్ 2020-21 సీజన్లో పూణె డెవిల్స్ తరపున ఆడుతున్న అతను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు. అంతేకాదు, ఖరీదైన ఐఫోన్‌ను గిఫ్ట్‌గా పొందాడు. ఈ విషయం బయటికి రావటంతో ఐసీసీ సమగ్రంగా విచారించి అతనిపై వేటు వేసింది.