దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీల రాతలు కలకలం రేపాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరింపులకు పాల్పడిన వేళ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు వెలువడ్డాయి.
ఔటర్ ఢిల్లీ చందర్ విహార్ ప్రాంతంలో ఖలిస్తాన్‌కు మద్దతుగా గోడలపై నినాదాలు రాశారు. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నినాదాలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.