యోగాసనాలు రోజూ ప్రాక్టిస్ చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. యోగాసనాల్లో తాడాసనం ఒకటి.తాడాసనంలో ముందుగా రెండు పాదాలనూ దగ్గరగా ఉంచి రెండు చేతులూ తల కంటే పైకి తీసుకెళ్లి వేళ్లను కలిపి అరచేతులు పై వైపున ఉండేలా తిప్పి పెట్టాలి. మెల్లగా కాలి మునివేళ్ల మీద నిలబడాలి. అలా కొన్ని క్షణాలు శరీరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. పాదాల దగ్గర్నుంచి చేతుల వరకూ శరీరాన్ని పైకి లేపుతున్నట్టుగా చేయాలి. 20 - 30 క్షణాలు అలా ఉండి, మడాలను కింద పెట్టి యథాస్థితికి వచ్చేయాలి. ఇలా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందికి పదిసార్లు చొప్పున చేయాలి.