ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ విమానంలో మంగళవారం ఓ ప్రయాణికుడికి అనుకోని పరిస్థితి ఎదురైంది. SG268 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సదరు ప్రయాణికుడు టాయిలెట్ రూమ్‌కు వెళ్ళాడు.
అనంతరం డోర్ తీయబోతే అది తెరుచుకోలేదు. దీంతో అతడు ఆందోళనకు గురయ్యాడు. సిబ్బంది తలుపులు తీసేందుకు యత్నించినా రాలేదు. విమానం బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఇంజినీర్లు తలుపు పగలగొట్టి అతడిని కాపాడారు.