స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో సెక్షన్ 17 ఏ అంశం తెరపైకి వచ్చింది. అసలు సెక్షన్ 17ఏ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.!
ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ కార్యనిర్వహణలో పాలు పంచుకునే ప్రజా ప్రతినిధులు తన విధుల్లో భాగంగా నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగినట్టు, అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చినా, సెక్షన్ 17 ఏ ప్రకారం వారిని తొలగించే అధికారం ఉన్న అధికారి అనుమతులు లేకుండా విచారించడానికి వీలు లేదు.