గొలుగొండ మండలం పాకలపాడు గ్రామ శివారు ప్రాంతంలో కోడిపందాల శిబిరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న ముగ్గులు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు.
వారి వద్ద నుంచి రెండు కోళ్ళు 600 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa