ప్రపంచంలోని అన్నీ దేశాల మిలిటరీ సామర్ధ్యాల వివరాలను గ్లోబల్ ఫైర్ తాజాగా విడుదల చేసింది. 145 దేశాల సైనిక శక్తి సామర్థ్యాలను మిలిటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్-2024 పేరుతో ఓ రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది.
సైనికుల సంఖ్య, ఆయుధాలు మొదలుకొని మొత్తం 60కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఇందులో శక్తివంతమైన టాప్ 10 దేశాల జాబితాలో అమెరికా తొలి స్థానం దక్కించుకోగా, రష్యా 2వ, చైనా 3వ స్థానాల్లో నిలిచాయి. భారత్ 4వ శక్తిమంతమైన దేశంగా నిలిచింది.