ఎస్మా చట్టంకు వ్యతిరేకంగా బుధవారం కమలాపురం పట్టణంలో ర్యాలీగా వెళ్లి కమలాపురం ఐసిడిఎస్ అధికారులకు వినతి పత్రంను అంగన్వాడి కార్యకర్తలు సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మి మాట్లాడుతూ పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఏమిటన్నారు. కమలాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.