సంక్రాంతి పండుగ వేళ ఎమ్మెల్యే తన అభిమానులకు సర్ప్రైజ్ చేశారు. విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. సంక్రాంతి కానుకగా కోడి, మద్యం బాటిళ్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 400 మందికి కోళ్లు, మద్యం ఫుల్ బాటిళ్లు పంపిణీ చేశారు. టోకెన్లు జారీ చేసి మరీ ఈ పంపకాలు చేపట్టారు. ఎమ్మెల్యే అనుచరులు తొలుత ఇంటింటింకీ వెళ్లి టోకెన్లను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కు చెందిన రామబాణం జూనియర్ కాలేజీ వేదికగా కోళ్లు, మందు బాటిళ్లు పంపిణీ చేశారు. టోకెన్లు తెచ్చినవారికి వీటిని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ఇదో రకమైన ప్రయత్నమని టీడీపీ, జనసేన నేతలు విమర్శిస్తున్నారు. కిందటేడాది దసరా పండుగ సందర్భంగానూ.. ఎమ్మెల్యే గణేష్ తమ పార్టీ కార్యకర్తలకు ఇదేవిధంగా కోళ్లు, క్వార్టర్ బాటిళ్లను పంపిణీ చేశారు. విశాఖ దక్షిణ మండల వైసీపీ అధ్యక్షుడు దొడ్డి బాపు ఆనంద్ నాడు వీటిని పంపిణీ చేశారు.