సీఎం జగన్ నేడు హైదరాబాద్ రానున్నారు. తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈరోజు సాయంత్రం 6.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగే నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.