ఓ ప్రయాణికుడు విమానంలో బాత్రూంలో చిక్కుకున్నాడు. ముంబయి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ స్పైస్ జెట్ విమానంలోని ప్రయాణికుడు మరుగుదొడ్డికి వెళ్లాడు. అనంతరం బయటకు రాబోగా తలుపు తెరుచుకోలేదు. అతడి కేకలను తోటి ప్రయాణికులు, సిబ్బంది గుర్తించి వారు ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. అతడిని కమోడ్పైనే కూర్చోమంటూ చీటీ రాసి లోనికి పంపారు. విమానం బెంగళూరులో దిగాక ఇంజినీర్ల సాయంతో డోర్ తీశారు.