‘ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులను నెల రోజుల్లోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలి. ఇందుకు సంబంధించిన విధివిధానాలను వచ్చే వారంలోగా ఖరారు చేయాలి. కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. విధానాలను చర్చించి ఖరారు చేసేందుకు రెండువారాల్లోగా కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తిశాఖ నిర్ణయించింది’ అని రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు.