దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఈ మేరకు ధనిక రైతులపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే నెల 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అషిమా గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.