ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నాటికి, ఎనిమిది రంగాలకు రూ.4,415 కోట్ల ప్రోత్సాహకాలను కేంద్ర సర్కారు మంజూరు చేసింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ విభాగం డీపీఐఐటీ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి రూ.11,000 కోట్లను మంజూరు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు ఆయన ప్రకటించారు.