మనుషులు మాట్లాడుకుంటారు.. జంతువులు మాట్లాడుకుంటాయి.. ఎవరి భాష వారికి ఉంటుంది. అలాగే మొక్కలు కూడా మాట్లాడుకుంటాయని ఆధారాలతో నిరూపించారు జపాన్ పరిశోధకులు. బయోసెన్సర్ ఆధారంతో మొక్కలు మాట్లాడుకోవటాన్ని వీడియో తీశారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సదరు మొక్క పక్కనుండే వేరే మొక్కలతో సంభాషించటాన్ని చిత్రీకరించారు. టమాట మొక్కపై దాడి జరిగే క్రమంలో దాని ఆకులు కాల్షియంసిగ్నల్స్(హెచ్చరిక సందేశాలు)ను వేరే మొక్కకు చేరవేయటాన్ని గుర్తించారు.