అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన వేడుకను వీక్షించేందుకు జనవరి 22న కోర్టులకు సెలవు ఇవ్వాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తించడానికి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నట్లు బార్‌కౌన్సిల్ ఛైర్మన్ మనన్‌కుమార్ మిశ్రా లేఖలో పేర్కొన్నారు. ఈ అభ్యర్థనను అత్యంత సానుభూతితో పరిగణించాలని ఆయన సీజేఐని కోరారు.