పైకి చల్లగా ఆహ్లాదాన్నిచ్చే హిమాలయాల అంతర్భాగంలో భారీ యుద్ధమే జరుగుతోందట. భారత టెక్టోనిక్ ఫలకలో చీలిక వస్తుండటమే అందుకు ముఖ్య కారణమట. యురేషియన్ టెక్టోనిక్ ఫలకతో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకు పెరిగి, ఆ ప్రాంతంలో ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే అవకాశం ఉందంటూ భూగర్భశాస్త్ర నిపుణులు భారత టెక్టోనిక్ ఫలక సంఘర్షణ ప్రభావాన్ని వివరించారు.