'గూగుల్‌పే' తన యూజర్లకు శుభవార్త తెలిపింది. తాజాగా 'ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్'తో ఒప్పందం కుదుర్చుకుంది. విదేశాల్లో ఉన్న భారతీయులు యూపీఐ చెల్లింపులు చెల్లించడానికి అనుకూలంగా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో విదేశాలకు వెళ్లేటప్పుడు డబ్బు తీసుకెళ్లడం లేదా అంతర్జాతీయ గేట్‌వే చార్జీల భారం తగ్గిపోనుంది. అలాగే గూగుల్ పే ద్వారా విదేశాల నుంచి నగదు బదిలీ సులభతరం అవుతుందని సంస్థ ప్రకటించింది.