తమకు కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలంటూ బిల్కిస్‌బానో కేసులోని ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవాలని, ఇద్దరు పిల్లల అవసరాలు తీర్చాలని, ఆస్తమాతో బాధపడుతున్న తనకు ఇటీవలే శస్త్రచికిత్స జరిగిందని దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ కోర్టుకు తెలిపాడు. అతడితోపాటు మరో ఇద్దరు దోషులు కూడా లొంగిపోవడానికి అదనపు సమయం ఇవ్వాలని కోరారు.