అసోంలోని గువాహటి పట్టణంలోని బ్రహ్మపుత్రా నది ఒడ్డున ఉన్న నీలాచల పర్వతంపై కామాఖ్యా దేవి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీల మాదిరిగానే కామాఖ్యా దేవి నెలలో మూడు రోజులు రుతుస్రావం ఉంటుంది.
ఆ రోజుల్లో యోని శిల నుంచి ఎరుపు రంగు స్రావం వెలువడుతుందని చెబుతుంటారు. ఆ మూడు రోజులు ఆలయాన్ని మూసేస్తారు. నాలుగో రోజు పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుతారు. అర్చకులు పార్వతీ గుండంలో అమ్మవారి బట్టలు ఉతికి వాటికి వేలం వేస్తారు.