మణిపూర్లో మళ్లీ హింస మొదలైంది. బిష్ణుపూర్ జిల్లాల్లో గురువారం నలుగురు హత్యకు గురయ్యారు. తాజాగా జరిగిన హింసాకాండలో మరో ముగ్గురు మృతి చెందడంతో ఆ సంఖ్య ఏడుగురికి చేరింది. వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.
మోరే గ్రామంలో సాయుధ మిలిటెంట్లు వీరిని కాల్చి చంపారు. మరో గ్రామంలో దుండగులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గ్రామ వాలంటీర్ మృతి చెందాడు. రిజర్వేషన్ల విషయంలో కుకీలు, మెయిటీలకు మధ్య రేకెత్తిన అల్లర్లతో మణిపూర్ అల్లకల్లోలంగా మారింది.