టిడిపి బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమ్మలమడుగు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సి. భూపేష్ సుబ్బరామిరెడ్డి కోరారు. శుక్రవారం వాటర్ ట్యాంక్ కాలనీలో పది కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరికి ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన వారు సముద్రాల సుబ్బరాయుడు, చిన్న సుబ్బరాయుడు, జయరాముడు, రామకృష్ణ తదితరులున్నారు.