విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఈ భూములను ఉపయోగించకూడదని ఆదేశించింది. కాగా రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు అప్పటి ప్రభుత్వం 35 ఎకరాలు కేటాయించింది.