ఈ నెల 20వ తేదీన లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నట్టు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీనారాయణ చెప్పారు. శుక్రవారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడారు. యండమూరి వీరేంద్రనాథ్‌కు సాహిత్య పురస్కారం అందజేస్తామన్నారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, సభాధ్యక్షతగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేష సాయి హాజరుకానున్నారు.