రాజస్థాన్ జైపూర్లో చిరుత హల్చల్ చేసింది. కనోతా ప్రాంతంలోని ఓ ప్రైవేటు హోటల్ గదిలోకి ప్రవేశించి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో సిబ్బంది
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు ఎంతో చాకచక్యంగా చిరుత పులిని పట్టుకొని బోనులో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.