అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలో రైల్వే శాఖ కూడా భాగస్వామ్యం కానుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రాముని పేరుతో ఉన్న 343 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
వివిధ రాష్ట్రాల్లో రాముని పేరుతో ఉన్న ఈ రైల్వే స్టేషన్లను విద్యుత్ దీపాలతో అలంకరించనుంది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 55 రైల్వేస్టేషన్లు ఉండగా, తమిళనాడులో 54 ఉన్నాయి. తర్వాతి స్థానంలో బిహార్ ఉంది.