ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హౌతీలపై తిరుగుబాటుకు యెమెన్ పిలుపునిస్తోంది. 'హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా,
యూకే వైమానిక దాడులతో పాటు భూతల యుద్ధానికి మాకు విదేశీ సహాయం అవసరం. ఎర్ర సముద్రంలో అంతర్జాతీయ నావిగేషన్‌ను సురక్షితంగా ఉంచడానికి అంతర్జాతీయ, ప్రాంతీయ కూటమి అవసరం" అని యెమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ కౌన్సిల్ లీడర్ ఐదారుస్ అల్-జుబైది పేర్కొన్నారు.