అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతుండగా.. థాయిలాండ్‌లోని అయుత్తయ్య నగరంలోనూ ఉత్సవ కోలాహలం మొదలైంది. స్థానిక చవోఫ్రయ, లోప్ బురి, పాసక్ నదుల జలంతో కూడిన పాత్రలు, అయుత్తయ్య నగరం నుంచి మట్టి ఇప్పటికే భారత్‌లోని అయోధ్యకు చేరాయి. 22న అయుత్తయ్యతోపాటు ఇతర ఆలయాల్లోనూ దీపోత్సవాలు, రామభజనలు నిర్వహించనున్నారు. థాయ్ ఆలయాల్లో విశాలమైన తెరలను ఏర్పాటుచేసి, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.