విజయవాడలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎక్కడా కనిపించలేదు. రాజ్‌భవన్‌కు కూతవేటు దూరంలోనే కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం తరఫున గవర్నర్‌ను ఆహ్వానించారా.. లేదా? ఒకవేళ ఆహ్వానించినా హాజరుకాలేదా? అనేది చర్చనీయాంశమైంది. మరోవైపు లేజర్ షోలో అంబేడ్కర్ విగ్రహం కంటే ఎత్తులో కొన్నిసార్లు సీఎం జగన్ చిత్రాన్నిచూపించడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.