కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి.వరాలెను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయన స్థానంలో కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ పి.ఎస్.దినేశ్‌కుమార్ పేరును ప్రతిపాదించింది. జస్టిస్ ప్రసన్న పేరును కేంద్రం ఆమోదిస్తే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీల్లో ఎస్సీ వర్గానికి చెందిన మూడో వ్యక్తిగా ఆయన నిలుస్తారు.